Sun Feb 01 2026 08:13:14 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ కు జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు హైదరాబాద్ కు రానన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి 3.30 గంటలకు చేరుకుంటారు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు హైదరాబాద్ కు రానన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి 3.30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడి నుంచి హైటెక్స్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశమై చర్చించనున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలకు....
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇప్పటికే అనేక మంది నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్య నేతలందరూ 119 నియోజకవర్గాల్లో కార్యకర్తల ఇంట్లో రాత్రి బస చేశారు. నేడు హైదరాబాద్ కు రానున్నారు. వారందరితో సమావేశమై కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన ముసాయిదాను రూపొందించనున్నారు.రేపు, ఎల్లుండి హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.
Next Story

