Tue Jan 20 2026 20:01:49 GMT+0000 (Coordinated Universal Time)
ఐఏఎస్ అధికారులపై ఈటల ఏమన్నారంటే?
ఐఏఎస్ అధికారులు చట్ట ప్రకారం తమ విధులు నిర్వహించాలని బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు

ఐఏఎస్ అధికారులు చట్ట ప్రకారం తమ విధులు నిర్వహించాలని బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఐఏఎస్ అధికారులకు 35 ఏళ్ల సర్వీస్ ఉంటుందని, రాజకీయ నాయకులు 5 ఏళ్లు పదవిలో ఉంటారని, కానీ యధా రాజా తథా ప్రజా ఉంటారు కానీ యధా ప్రజా తధా రాజా ఉండరని ఈటల రాజేందర్ తెలిపారు. అధికారులు నిబద్ధత నిజాయితీతో ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం విఫలమయినప్పుడే...
ప్రభుత్వం విఫలం అయినప్పుడు ఏం చేయాలని, నాయకులు చట్టం చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు ఈటల రాజేందర్. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారన్న ఈటల ఐఏఎస్ అధికారులపై వ్యాఖ్యలు చేసేకంటే వారిని తప్పు చేయవద్దని ప్రోత్సహించవద్దంటూ ప్రభుత్వానికి కూడా చురకలు అంటించారు. ఎస్ బాస్ అంటే జైళ్లకు పోతారు జాగ్రత్త అంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. చట్టప్రకారం పనిచేయాలని, బాధ్యతలను నిర్వహించాలని తెలిపారు.
Next Story

