Fri Dec 05 2025 11:17:34 GMT+0000 (Coordinated Universal Time)
నాకు ఏం సంబంధం... మంత్రివర్గం మొత్తం నిర్ణయం
కాళేశ్వరం కార్పొరేషన్ తో తనకు సంబంధం లేదని తాను కమిషన్ తో చెప్పానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు

కాళేశ్వరం కార్పొరేషన్ తో తనకు సంబంధం లేదని తాను కమిషన్ తో చెప్పానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కమిషన్ విచారణకు హాజరయిన తర్వాత బయటకు వచ్చిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, మేడిగడ్డం, అన్నారం ప్రాజెక్టులకు సంబంధించి క్వాలిటీని చెక్ చేయాల్సింది ఇంజినీరింగ్ నిపుణులు మాత్రమేనని, ఆర్థిక శాఖ కాదని తాను చెప్పానని అన్నారు. డిజైన్లు, నిర్మాణంతో తనకు సంబంధం లేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిటీకి తాను వివరించానిన చెప్పారు.
తన ప్రమేయం లేదని...
మహారాష్ట్ర, సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ అభ్యంతరాలపై మంత్రుల కమిటీని వేశారన్న ఈటల రాజేందర్ తనకు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉందా? అని ప్రశ్నించారని, అందులో తన ప్రమేయం లేదని చెప్పానన్నారు. టెక్నికల్ అంశాలను పరిశీలించిన తర్వాతనే మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్మించారన్నారు. మంత్రివర్గం ఆమోదం పొందితేనే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ తెలిపారు. బ్యారేజీ నిర్మాణ ప్రదేశాలను ఎందుకు మార్చారని ప్రశ్నించారని, అయితే అందులో తన ప్రమేయం లేదని తాను చెప్పినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story

