Sun Dec 14 2025 02:02:33 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కు ఆ దమ్ము లేదని తేలిపోయింది : ధర్మపురి అరవింద్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందన్న కారణంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడంలేదని అన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారంలో ఉండగా...
గత ఎన్నికల ప్రచారంలో హామీలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడారని, అధికారంలో ఉండగా ఏంచేశారని పాదయాత్రలు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇక, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను బెదిరించేలా ఉన్నాయని ధర్మపురి అరవింద్ అన్నారు.
Next Story

