Sun Mar 22 2026 15:35:46 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరుతున్న సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యలలో భాగంగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు...
ఇప్పటికే రాజాసింగ్‌పై శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని కేసు నమోదు అయింది. హనుమాన్ యాత్రలో కూడా ప్రసంగించే అవకాశముందని భావించి పోలీసులు రాజాసింగ్‌ను ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హనుమాన్ శోభాయాత్రకు పదివేల మందితో భద్రత కల్పించారు.
Next Story

