Wed Jan 28 2026 10:43:03 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : కేసులకు భయపడే ప్రశ్నే లేదు
తనకు కేసులు కొత్తేమీ కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను హిందూధర్మం కోసం కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు.

తనకు కేసులు కొత్తేమీ కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను హిందూధర్మం కోసం కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. కేసులకు తాను భయపడేది లేదని చెప్పారు. తనపై గతంలోనూ, ఇప్పుడూ ఎప్పుడూ కేసులు పెడుతూనే ఉన్నారన్నారు. అయినా తాను దేనికీ భయపడబోనని, తాను హిందువుల కోసమే చివర వరకూ బతుకుతానని తెలిపారు.
హిందుత్వాన్ని కాపాడేందుకు...
హనుమాన్ శోభాయాత్రకు వేలాది మంది తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. హిందుత్వాన్ని కాపాడటంలో తాను వెనక్కు తగ్గనని అన్నారు. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను పఠించాలని రాజాసింగ్ పిలుపు నిచ్చారు. మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చేది హనుమాన్ చాలీసా అని రాజాసింగ్ అన్నారు.
Next Story

