Mon Mar 16 2026 11:44:52 GMT+0530 (India Standard Time)
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే తలలు నరుకుతున్నారన్నారు. ఈరోజు కాకపోతే తనను ఎవరైనా చంపేస్తారని రాజాసింగ్ అని అన్నారు. తాను ధర్మం కోసం నిలబడతానని ఆయన తెలిపారు.
చనిపోయే ముందు తన కల...
ప్రతి వారు చనిపోక తప్పదన్నారు. అయితే తాను చనిపోయే ముందు తన కల తనలాగా అందరూ తయారు కావాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. రాజకీయం వేరు, ధర్మం వేరు అని రాజాసింగ్ అన్నారు.
Next Story

