Fri Dec 05 2025 17:32:39 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ విడుదల
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఒకవర్గం మనోభావాలను కించపర్చే విధంగా వీడియో పోస్టు చేసినందుకు అరెస్ట్ చేశారు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఒకవర్గం మనోభావాలను కించపర్చే విధంగా వీడియో పోస్టు చేసినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. నిన్న రాజాసింగ్ వీడియో పై ఎంఐఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై పల కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ ను ఆయన ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ధర్మం కోసం చావడానికైనా...
తనపై నమోదయిన కేసుల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాను ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని ఆయన తెలిపారు. మునావర్ షోను ఎందుకు జరిపించారని ఆయన ప్రశ్నించారు. రామభక్తులు ఈ విషయాన్ని అడుగుతున్నారని ఆయన అన్నారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీని హైదరాబాద్ కు తీసుకు రావద్దని హెచ్చరించినా కేటీఆర్ షో పట్టుబట్టి జరిపించారని ఆరోపించారు.
యాక్షన్ కు రియాక్షన్...
మునావర్ ఫారూఖీ షోకు కౌంటర్ గా తాను వీడియోలు రిలీజ్ చేస్తానని ముందే చెప్పానని రాజాసింగ్ తెలిపారు. రెండో భాగం వీడియోను త్వరలో అప్ లోడ్ చేస్తానని చెప్పారు. తాను చేసిన వీడియోను యూట్యూబ్ ను తొలగించారని, త్వరలోనే యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని రాజాసింగ్ తెలిపారు. ఎలాంటి చర్యలకు దిగినా తాను ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని రాజాసింగ్ ప్రకటించారు.
Next Story

