Thu Dec 18 2025 18:02:37 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయ్
తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.

తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారని, ఇక్కడకూ బుల్ డోజర్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో బుల్డోజర్లను ఆర్డర్ చేశామని, అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి అవి దూసుకు వెళతాయని రాజాసింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాజా సింగ్ మాట్లాడారు.
మసై పోతారు.....
ఈటల రాజేందర్ ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉణ్నారన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ ల జోలికి వస్తే ఖబడ్దార్ అని రాజాసింగ్ హెచ్చరించారు. వారిద్దరితో పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లు మసైపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Next Story

