Sun Mar 08 2026 06:02:23 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో లేరా..?
సీఎం కేసీఆర్ రాష్ట్రం నుంచి కాదని ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని కాదని ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎంతో మంది తెలంగాణలో నిపుణులైన వారున్నప్పటికీ మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్ర ఇంజినీర్...
మహారాష్ట్ర ఇంజినీర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కొలువు ఎందుకు ఇచ్చారంటూ రఘునందన్ రావు నిలదీశారు. నెలకు ఒకటిన్నర లక్షం జీతం చెల్లిస్తూ మహారాష్ట్ర ఇంజినీరును ఎందుకు నియమించుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ము ఇతరుల పాలు చేస్తున్నారని, అందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అంటూ ఆయన కేసీఆర్ పై మండి పడ్డారు.
Next Story

