Sun Mar 15 2026 16:38:59 GMT+0530 (India Standard Time)
నేడు విచారణకు ఈటల
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట హాజరు కానున్నారు.

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరంగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట హాజరు కానున్నారు. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రాన్ని నిందితుడు ప్రశాంత్ ఈటల రాజేందర్ ఫోన్ కు షేర్ చేశారు. దీంతో ఈ నెల 6వ తేదీన నోటీసులు జారీ చేసిన వరంగల్ పోలీసులు ఏడో తేదీన విచారణకు రావాలని కోరారు.
పదో తరగతి ప్రశ్నాపత్రం...
కానీ ముందుగానే ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున తాను పదో తేదీన హాజరవుతానని, ఈరోజు కాలేనని ఈటల రాజేందర్ డీసీపీకి లేఖ రాశారు. అందుకు వరంగల్ పోలీసులు కూడా అంగీకరించారు. తనకు ఇచ్చిన నోటీసుల మేరకు ఈటల మరికాసేపట్లో వరంగల్ డీసీపీ ఎదుట హాజరు కానున్నారు.
Next Story

