Wed Mar 25 2026 05:09:38 GMT+0530 (India Standard Time)
అప్పుల కుప్పగా మార్చి.. జాతీయ రాజకీయాలా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటున్న కేసీఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. అలాగే గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో అవినీతి జరుగుతుందని ఆయన మండి పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయిగా మారిపోయారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.
ఐలమ్మ విగ్రహాన్ని...
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ పై ప్రతిష్టించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో ఆయన ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలుపర్చలేదని ఈటల రాజేందర్ అన్నారు. ప్రగతి భవన్ కే పరిమితమైన కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని అన్నారు.
Next Story

