Fri Dec 05 2025 12:39:30 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి ఆరోపణలు చేసిన ఈటల
తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు

తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా అసభ్యంగా మాట్లాడారన్నారు. తాను ఏ రాజకీయ నేత గురించి కూడా తప్పుగా మాట్లాడలేదని ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.
రేవంత్‌ను తాను అనలేదే...
వీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టడని, పార్లమెంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోరాటాలు చేశాయన్న ఈటల రేవంత్‌రెడ్డికి నాకు పోలిక ఏంటి? అని ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ జైలుకి వెళ్లివచ్చారని, తాను విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నానని, బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని ఈటల రాజేందర్ మరోసారి ఆరోపణలు చేశారు.
Next Story

