Thu Jan 29 2026 01:09:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవచ్చు : ఈటల రాజేందర్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండని తెలిపారు. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండక పోవచ్చని అన్నారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వవద్దంటూ ఈటల రాజేందర్ సూచించారు. స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
న్యాయపరంగా చెల్లుబాటు కాని...
న్యాయపరంగా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి ? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి ? అని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుందన్న ఈటల రాజేందర్, మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిందన్నారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు.
Next Story

