Thu Dec 18 2025 05:15:26 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : రాజాసింగ్ రాజీనామా లేఖపై స్పందించిన బీజేపీ
గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ నాయకత్వం స్పందించింది.

గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ నాయకత్వం స్పందించింది. రాజాసింగ్ వైఖరిపై సీరియస్ అయింది. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు ఇవ్వాలని సూచించింది. రాజాసింగ్ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందని అభిప్రాయపడింది. రాజీనామా సింగ్ రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడికి పంపుతున్నామని తెలిపింది.
వ్యక్తుల కంటే...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావును రాజాసింగ్ వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తూ లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని తెలిపింది. గతంలోనూ క్రమశిక్షణారాహిత్యంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని, తిరిగి పార్టీలోకి తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నందున తాము రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపుతున్నామని, వారు నిర్ణయం తీసుకుంటారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story

