Sat Dec 06 2025 04:22:34 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వం రద్దు చేస్తే రాష్ట్రపతి పాలనే
అసెంబ్లీ రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు రావని, రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ నేతలు అన్నారు

అసెంబ్లీ రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు రావని, రాష్ట్రపతి పాలన వస్తుందని బీజేపీ నేతలు అన్నారు. భైంసా సమీపంలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు బీజేపీ నేతలు మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లు ప్రసంగించారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలన సాగిస్తుందని వారు ఆరోపించారు.
మంత్రులు బానిసల్లాగా...
పార్టీ పై విమర్శించిన వారి ఇళ్లపై దాడులు చేస్తున్నారని, పోలీసులు కూడా వారికి అండగా నిలుస్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. దమ్ముంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేసీఆర్ కు వారు సవాల్ విసిరారు. కేసీఆర్ కు బానిసల్లా పనిచేస్తున్న మంత్రులు కొందరు దాడులు చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని, దానిని ఎవరూ ఆపలేరని వారు అభిప్రాయపడ్డారు.
- Tags
- bandi sanjay
- bjp
Next Story

