Sun Mar 08 2026 03:12:21 GMT+0530 (India Standard Time)
పొంగులేటి కోసం బీజేపీ
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించేందుకు బీజేపీ నేతలు ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించేందుకు బీజేపీ నేతలు ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు. ఈటల రాజేందర్, రఘునందన్ రావులు ఈరోజు మధ్యాహ్నం పొంగులేటితో భేటీ కానున్నారు. ఈటల వెంట మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బయలుదేరి వెళ్లారు.
మధ్యాహ్నం కలిసి...
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే తమ పార్టీలో చేరితే ఆఫర్లు ఏమేమి ఉంటాయో ఈటల బృందం పొంగులేటికి వివరించనుంది. ఆయనతో జరగనున్న మధ్యాహ్న భోజన సమావేశంలో బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఆయన కోరిన టిక్కెట్లను ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమయినట్లు సమాచారం.
Next Story

