Sat Mar 07 2026 21:55:18 GMT+0530 (India Standard Time)
బీజేపీ సమావేశాల్లో రహస్యంగా వీడియో చిత్రీకరణ
సమావేశాల్లో వీడియో తీస్తున్న ఇంటలిజెన్స్ అధికారిని బీజేపీ నేతలు పట్టుకున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం రేగింది. ఇంటలిజెన్స్ అధికారిని సమావేశాల్లో పట్టుకున్నారు. సమావేశాల్లో వీడియో తీస్తున్న ఇంటలిజెన్స్ అధికారిని బీజేపీ నేతలు పట్టుకున్నారు. ఇక్కడ ఏం పని అని ఆయనను ప్రశ్నించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు లోపలికి రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారి ప్రవేశించి వీడియో తీశారు. దీనిని గుర్తించిన బీజేపీ నేతలు ఆయనను పట్టుకుని వీడియోలు, ఫొటోలు డిలీట్ చేశారు.
వీడియో తీస్తుండగా....
పోలీస పాస్ తో సెక్యురిటీ పేరు మీద లోపలికి వచ్చారు. ఇంటలిజెన్స్ అధికారి శ్రీనివాసరావు ఫొటోలు తీస్తుండగా బీజేపీ నేతలు పట్టుకుని కమిషనర్ కు అప్పగించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఈ రకమైన చర్యలకు దిగుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమావేశాల్ని రహస్యంగా చిత్రీకరించడంపై బీజేపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
Next Story

