Thu Mar 19 2026 06:27:32 GMT+0530 (India Standard Time)
రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. తనపై ఛార్జిషీట్ విడుదల చేసే స్థాయి రేవంత్ కు లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు చోరీలు చేసేవారన్నారు. తనపై నోరు జారితే మునుగోడులో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. తాను రాజీనామా చేయబట్టే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు మంజూరయ్యాయయన్నారు.
ఇండిపెండెంట్ గా నైనా...
మునుగోడులో ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా తనకు ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఓడిపోయే స్థానాల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించిన సత్తా తమ కుటుంబానికి ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో కుటుంబ పార్టీలను బొంద పెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. గట్టుప్పల్ మండలంలో పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

