Mon Dec 15 2025 20:18:55 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఎంఐఎం అవకాశవాద పార్టీ.. ఎక్కడ అధికారం ఉంటే?
అధికారం ఎక్కడ ఉంటే ఎంఐఎం అక్కడ ఉంటుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు.

అధికారం ఎక్కడ ఉంటే ఎంఐఎం అక్కడ ఉంటుందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఆ పార్టీ పంచన చేరిన ఒవైసీ బ్రదర్స్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోగానే రూగు మార్చారన్నారు. కాంగ్రెస్ వెంట నడుస్తున్నారన్నారు.ఎంఐఎం ఫక్తు అవకాశవాదీ పార్టీ అన్నది అందరికీ అర్థమయిందని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పార్టీ అది అని ఆయన ఫైర్ అయ్యారు.
మోదీ సారథ్యంలోనే...
భారత్ దేశం మోదీ సారథ్యంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కరోనా వంటి కష్టసమయాల్లో మోదీ ప్రధానిగా ఉండటం వల్లనే ఆ వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని చెప్పారు. సకాలంలో వ్యాక్సిన్లు వచ్చేలా చేసి ఎక్కువ మంది ఆ వైరస్ బారిన పడి మరణించకుండా చర్యలు తీసుకోగలిగారన్నారు. అందుకే మోదీ మరొకసారి ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలోనూ అత్యధికస్థానాలను బీజేపీకి దక్కేలా ప్రజలు సహకరించాలని ఆయన కోరుతున్నారు.
Next Story

