Thu Mar 23 2023 23:33:45 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయ్
దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని, ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ కు ఈటల రాజేందర్ ఛాలెంజ్ విసిరారు.

కేసీఆర్ ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తననే టార్గెట్ చేశారన్నారు. కేసీఆర్ లా సంస్కారం లేకుండా మాట్లాడనని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని, ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ కు ఈటల ఛాలెంజ్ విసిరారు. నిన్న మీడియా సమావేశంలో కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిందన్నారు. తాము ఉద్యమకారులమని, బానిసలం కాదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
అహంకారం నెత్తికెక్కి....
ఉద్యమకారుడిగా ప్రశ్నిస్తే తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టారని, తాను పార్టీ నుంచి వెళ్లలేదని ఈటల రాజేందర్ తెలిపారు. ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏ రాజకీయ నేతలు తనమీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ వ్యూహం ఏంటో తనకు తెలుసునని చెప్పారు. టీఆర్ఎస్ ను బొందపెట్టడం ఖాయమని తెలిపారు. ధైర్మం లేనిది కేసీఆర్ కే నని అన్నారు. ఎన్నికలకు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. గజ్వేలు ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాను వెనక్కు తగ్గేది లేదని, గజ్వేల్ లో పోటీ చేస్తానని, కేసీఆర్ ఛాలెంజ్ ను స్వీకరిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story