Sat Jan 31 2026 14:47:26 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నేత బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ లో ఉన్నారని తెలిపారు.

బీజేపీ నేత బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్ లో ఉన్నారని తెలిపారు. ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ తమతో ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోనని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ ను ఎన్డీఏ కూటమిలో చేర్చుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లను తాము గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే...
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నుంచి అనేక మంది షిండేలు బయటకు వస్తారని ఆయన తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు నమ్మేవారు ఎవరైనా పార్టీలో చేరవచ్చని ఆయన అన్నారు. కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీశ్‌రావు బయటకు వస్తే బీజేపీలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. 20వ తేదీ నుంచి బస్సుల యాత్ర మొదలవుతుందని, 25వ తేదీ నుంచి రెండో ిదశ ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.
Next Story

