Fri Dec 05 2025 21:56:02 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో 31న జేపీ నడ్డా సభ రద్దు
ఈ నెల 31న మునుగోడులో జరప తలపెట్టిన జేపీ నడ్డా బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకుంది.

ఈ నెల 31న మునుగోడులో జరప తలపెట్టిన జేపీ నడ్డా బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకుంది. ఆరోజు మండల స్థాయి సభలను పెట్టానలి నిర్ణయించింది. అదే రోజు రెండు మున్సిపాలిటీలు, ఏడు మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలను కూడా నిర్వహించాలని భావిస్తుంది. బహిరంగ సభ కంటే ప్రజల్లోకి మరింతగా చేరువయ్యేందుకు మండల కేంద్రాల్లో ర్యాలీలు, సభలను నిర్వహించడమే మేలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.
మండల కేంద్రాల్లో...
మండల కేంద్రాల్లో జరిగే సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశముంది. నవంబరు 1వ తేదీతో మునుగోడులో ప్రచారం ముగియనుండటంతో 31న మునుగోడులో భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ సభకు జేపీ నడ్డాను కూడా ఆహ్వానించారు. కానీ తాజా రాజకీయ పరిస్థితులతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మండల కేంద్రాల్లో సభలను పెట్టాలని నిర్ణయించింది.
Next Story

