Thu Dec 18 2025 13:43:41 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బీజేపీదే విజయం
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి గెలిచారు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలిచారు. మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్లతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
రెండో ప్రాధాన్యాత ఓటింగ్ లో...
సరూర్ నగర్ మినీ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకూ సాగింది. బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్న కేశవరెడ్డిపై 1,150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఏ అభ్యర్థికి సరైన మెజారిటీ లభించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి ఏవీఎన్ రెడ్డిని విజేతగా అధికారులు ప్రకటించారు.
Next Story

