Thu Mar 19 2026 08:34:23 GMT+0530 (India Standard Time)
BJP : కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఈయనే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా బీజేపీ వంశీ తిలక్ ను ప్రకటించింది

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా బీజేపీ వంశీ తిలక్ ను ప్రకటించింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన గణేశ్ నారాయణన్ కాంగ్రెస్లోకి వెళ్లి ఆపార్టీ నుంచి పోటీ చేస్తుండగా ఇప్పుడు బీజేపీ కొత్త అభ్యర్థిని కంటోన్మెంట్ కు ఖరారు చేసింది.
ముగ్గురి పేర్లను...
ముగ్గురు పేర్లను పరిశీలించిన నాయకత్వం చివరకు వంశీ తిలక్ పేరుకు ఓకే చెప్పింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కూడా మే 13వ తేదీన జరగనుంది. వంశీ తిలక్ అందరికీ సుపరిచితుడు కావడంతో ఆయనను ఎంపిక చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story

