Mon Feb 16 2026 15:45:57 GMT+0530 (India Standard Time)
బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు
కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది

కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. దీంతో కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి ఇప్ప ఉమారాణి ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో బీజేపీకి సహకరించడం ఇష్టంలేని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతును ప్రకటించారు.
మున్సిపల్ ఛైర్మన్ గా...
దీంతో కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇది అరుదైన పరిణామమని చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతివ్వడం అనేది కామారెడ్డితో పాటు భైంసాలోనూ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నిక సజావుగా ముగియడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

