Sun Mar 15 2026 21:32:51 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డికి థాక్రే ఫోన్
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ వ్యవహరాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రే ఫోన్ చేశారు

భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ వ్యవహరాల ఇన్ఛార్జి మాణిక్రావు థాక్రే ఫోన్ చేశారు. గాంధీ భవన్ కు రావాల్సిందిగా ఆయన కోరారు. అయితే తాను బయట కలుస్తానని గాంధీభవన్ కు రాలేనని కోమటిరెడ్డి సున్నితంగా సమాధానం చెప్పినట్లు తెలిసింది.
పార్టీకి దూరంగా...
మునుగోడు ఉప ఎన్నిక నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్ కు దూరంగా ఉంటున్నారు. ఆయనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇచ్చింది. దీనికి కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. ఎన్నికలకు మూడు నెలల ముందు తాను నిర్ణయం తీసుకుంటానని ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో థాక్రే నుంచి ఫోన్ రావడం, ఆయన బయట కలుస్తానని చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story

