Sun Mar 15 2026 08:24:24 GMT+0530 (India Standard Time)
నేను రాజీనామా చేయలేదు : కోమటిరెడ్డి
తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు

తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని, అందులో వాస్తవం లేదని అన్నారు. తాను నిన్నంతా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోనే కలసి ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తన ముందు ఎలాంటి ఆప్షన్లు లేవని కూడా కోమటిరెడ్డి తెలిపారు.
పార్టీని వీడను...
తన రక్తంలోనే కాంగ్రెస్ ఉందని ఆయన చెప్పారు. ఇటువంటి ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన తెలిపారు. తనకు వేరే పార్టీలోకి వెళ్లే ఉద్దేశ్యం లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరూ తనపై వస్తున్న ప్రచారాన్ని చూసి నమ్మవద్దని, చివరి వరకూ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆయన చెప్పుుకొచ్చారు.
Next Story

