Thu Mar 19 2026 15:03:06 GMT+0530 (India Standard Time)
BJP : రేపు బీజేపీ కీలక సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతుంది

స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం ముందస్తు సమావేశాలను ఏర్పాటుచేసుకుంటుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచిన ఊపు మీదున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముందుండాలని భావిస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
ఇందుకోసం రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరుగుతుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై కూడా రేపటి సమావేశంలో స్పష్టత రానుంది.
Next Story

