Sun Mar 08 2026 01:29:41 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు బీజేపీ రైతు దీక్ష
తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు దీక్ష చేయనుంది.

తెలంగాణలో నేడు భారతీయ జనతా పార్టీ రైతు దీక్ష చేయనుంది. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. రైతు రెండు లక్షల రుణమాఫీ కూడా సక్రమంగా అమలు కావడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రైతు భరోసా నిధులను...
మరోవైపు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఇరవై నాలుగు గంటల దీక్ష బీజేపీ నేతలు చేయనున్నారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ఈ ధర్నాలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

