Sat Dec 06 2025 02:11:42 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి బీజేపీ బైక్ ర్యాలీలు
నేటి నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీలను చేపట్టనుంది

నేటి నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీలను చేపట్టనుంది. పల్లె గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ బైకు ర్యాలీలను బీజేపీ నేటి నుంచి చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో ఈ బైకు ర్యాలీలు చేపట్టాలని బీజేపీ భావించింది. తొలివిడతగా మొత్తం పదమూడు నియోజకవర్గాల్లో మొదటి దశ బైకు ర్యాలీలు జరపాలని భావించారు. కానీ నేడు ఆరు నియోజకవర్గాల్లోనే బైకు ర్యాలీలు జరగనున్నాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభమవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
వేములవాడలో...
కాగా ఈరోజు వేములవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన సిద్ధిపేటలో చేపట్టే ర్యాలీలో పాల్గొంటారు. బైకు ర్యాలీలతో ఈ భరోసా యాత్రను పది నుంచి పదిహేను రోజుల పాటు బీజేపీ నేతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కార్యకర్తలను సిద్దం చేశారు. పల్లెల్లో తిరిగి భరోసా కల్పిస్తూ బీజేపీ బలం పెంచుకోవడమే ఈ బైకు ర్యాలీల లక్ష్యంగా కన్పిస్తుంది.
Next Story

