Wed Jan 21 2026 05:17:41 GMT+0000 (Coordinated Universal Time)
28 నుంచి "బండి" పాదయాత్ర
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 28న ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 28న ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. డిసెంబరు 15 వరకూ ఈ యాత్ర కొనసాగే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర భైంసా నుండి ప్రారంభం కానుంది.
బాసరలో ప్రత్యేక పూజలు చేసి....
తొలుత బాసర సరస్వతి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ పాదయాత్రను భైంసాలో ప్రాంరభించనున్నారు. బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర చేశారని, 21 జిల్లాల్లో 1,178 కిలోమీటర్ల మేర ఆయన పర్యటించారు. ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ యాత్రను బండి సంజయ్ కొనసాగించనున్నారు.
Next Story

