Wed Mar 18 2026 11:42:24 GMT+0530 (India Standard Time)
సిట్ కు ఇవ్వను : బండి సంజయ్
తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదలచుకోలేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు

తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదలచుకోలేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సిట్ పై తనకు నమ్మకం లేదన్నారు. తనకు నమ్మకం కలిగిన సంస్థల వద్దకే తన వద్ద ఆధారాలను అందిస్తానని ఆయన తెలిపారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.
హాజరుకాలేను....
కానీ పార్లమెంటు సమావేశాలు ఉండటం, ఈరోజు ఖచ్చితంగా హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేయడంతో తాను విచారణకు రాలేనని సిట్ అధికారులకు ఇప్పటికే బండి సంజయ్ తెలిపారు. దీంతో బండి సంజయ్ నేడు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
Next Story

