Fri Dec 05 2025 19:56:41 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ అరెస్ట్
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనగామలో పర్యటిస్తున్న బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవిత ఇంటి వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పు పడుతూ ఆయన దీక్షకు దిగాలని నిర్ణయించారు. మధ్యాహ్నం వరకూ దీక్ష చేసి అనంతరం పాదయాత్ర చేయాలనుకున్నారు.
తోపలాట.. ఉద్రికత...
కానీ దీక్షకు సిద్ధమైన బండి సంజయ్ ను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా దీక్షకు సిద్ధమవుతున్న బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ ను అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధం చేసిన వాహనం ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story

