Thu Mar 19 2026 15:34:28 GMT+0530 (India Standard Time)
BJP : నేడు గజ్వేల్‌కు ఈటల
ఈరోజు భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పర్యటించనున్నారు.

ఈరోజు భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఈటల గజ్వేల్ లో పర్యటిస్తున్నారు. గజ్వేల్ లో జరగనున్న బహిరంగ సభలో ఈటల రాజేందర్ పాల్గొంటారు. పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.
తొలిసారి వస్తుండటంతో...
ఈటల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేయడానికి అధిష్టానం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల తలపడనున్నారు. ఈరోజు జరగనున్న బహిరంగ సభలో కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని ఈటల రాజేందర్ విమర్శలు చేయనున్నారు. తాను గజ్వేల్ లో పోటీ చేస్తానని ఎన్నికలకు ఏడాది ముందే ప్రకటించిన ఈటల తొలిసారి వస్తుండటంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
Next Story

