Tue Mar 10 2026 03:55:51 GMT+0530 (India Standard Time)
Breaking : రెండో జాబితా విడుదల.. డీకే సీటు
భారతీయ జనతా పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది

భారతీయ జనతా పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి గోడం నగేష్, మహబూబ్ నగర్ కు డీకే అరుణ, మెదక్ కు రఘునందన్ రావు, మహబూబాబాద్ కు సీతారాం నాయక్, పెద్దపల్లికి గోమాస శ్రీనివాస్ లను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. నల్లగొండ పార్లమెంటుకు సైదిరెడ్డి ని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహబూబ్ నగర్ స్థానానికి డీకే అరుణ, జితేందర్ రెడ్డి పోటీ పడగా, చివరకు డీకే అరుణకే సీటును ఖరారు చేసింది.
ఆరు స్థానాలకు...
తెలంగాణలో ఉన్న మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ పదిహేను స్థానాలను ప్రకటించినట్లయింది. ఇంకా ఖమ్మం, వరంగల్ ఎంపీ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ ఎవరి పేర్లను ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం తెలంగాణలో ఆరు పార్లమెంటు నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

