Sun Dec 14 2025 12:23:39 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు ఖమ్మం జిల్లాకు కేసీఆర్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో జరగనున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొద్ది రోజులుగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పది రోజుల నుంచి ఆయన తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు.
వరస సభలతో...
ఈరోజు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం జిల్లాలో అగ్రశ్రేణి నేతలు పార్టీని వీడటంతో ఆయన ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. గత నెల 27న ఆయన పాలేరులో పర్యటించారు. ఆ తర్వాత ఈరోజు మరోసారి ఖమ్మం జిల్లాకు రానున్నారు. కేసీఆర్ పర్యటనల కోసం ఆ నియోజకవర్గాల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దయెత్తున జనసమీకరణ చేయనున్నారు.
Next Story

