Mon Mar 23 2026 07:42:35 GMT+0530 (India Standard Time)
KCR : నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభాపతి కార్యాలయంలో ఎమ్మ్యెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన గెలుపొందిన తర్వాత శాసనసభలో ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేకపోయారు.
ప్రతిపక్ష నేతగా...
ఆయన కాలి తుంటి ఎముక విరగడంతో ఆయన చికత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపక్ష పక్ష నేతగా బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన అందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
Next Story

