Thu Jan 29 2026 04:41:08 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ ప్రమాణ స్వీకారం
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కొద్ది సేపటి క్రితం అసెంబ్లీకి వచ్చారు. శాసనసభ కార్యాలయంలోని స్పీకర్ ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నేతగా...
అయితే ఆయన కాలికి గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ఇంతవరకూ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Next Story

