జాగ్రత్త.. చెరువుల్లో దయ్యం చేపలొచ్చాయి
తెలంగాణ రాష్ట్రంలోని పలు చెరువుల్లో దెయ్యం చేపలు కనిపిస్తూ ఉండడంతో మత్య్సకారుల్లో ఆందోళన ఎక్కువవుతూ ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు చెరువుల్లో దెయ్యం చేపలు కనిపిస్తూ ఉండడంతో మత్య్సకారుల్లో ఆందోళన ఎక్కువవుతూ ఉంది. శరీరంపై నల్లని మచ్చలు, పదునైన పళ్లు, భయపెట్టే రూపం ఉండడంతో వీటిని దయ్యం చేప అని పిలుస్తారు. ఈ చేప మాంసాహారి కావడం వల్ల ఇది ఎక్కడుంటే అక్కడి చేపలు, ఇతర ప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశాలుంటాయి. ఈ చేపలు మనుషులను కూడా కరుస్తాయి.
చెరువుల్లోకి చేరితే కొద్దిరోజుల్లోనే ఇతర చేపలన్నింటిని తినేస్తాయి. విషపూరితం కావడంతో ఎవరూ వీటిని తినరు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి చర్లపల్లి చెరువులో ఇవి పెరగడంతో 150 మత్స్యకార కుటుంబాల జీవనాధారాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. గతేడాది మృగశిర కార్తెకు చేపలు విక్రయించి 3 లక్షలకు పైగా ఆదాయం గడించారు. ఈ ఏడాది ఆ ఆదాయం 6 వేలకు పడిపోయింది. ప్రస్తుతం వల వేస్తే ఎక్కువ సంఖ్యలో దయ్యం చేపలే పడుతుండగా వాటిని అప్పుడే కాల్చివేస్తున్నారు.

