Fri Dec 05 2025 12:23:25 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru Rave Party Case : సినీనటి హేమకు మరోసారి నోటీసులు
టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలో హేమ రక్తనమూనాలను పరీక్షించగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెకు తొలిసారి నోటీసులు ఇచ్చారు.
జూన్ 1న హాజరు కావాలంటూ...
ఈ నెల 27వ తేదీన విచారణ నిమిత్తం బెంగళూరుకు రావాలని హేమను కోరారు. అయితే తనకు వైరల్ ఫీవర్ ఉందని, తనకు కొంత సమయం కావాలని హేమ కోరారు. ఈ మేరకు హేమ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని అందుకు అంగీకరించిన పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మరి జూన్ 1న హేమ విచారణ కోసం బెంగళూరు వెళతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

