Sat Apr 01 2023 23:57:48 GMT+0000 (Coordinated Universal Time)
భక్తులతో కిటకిటలాడుతున్న బాసర
వసంత పంచమి కావడంతో బాసర సరస్వతీ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

వసంత పంచమి కావడంతో బాసర సరస్వతీ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువ జాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారితీరి ఉన్నారు. వసంత పంచమి కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదని భావించి అధిక సంఖ్యలో బాసరకు భక్తులు చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి కూడా అధిక సమయం పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఇంద్రకీలాద్రిపైనా...
అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రి కూడా భక్తులతో కిటకిట లాడుతుంది. వసంత పంచమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం మంచిదని భావించిన భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. అలాగే పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. క్యూలైన్ ల వద్ద భక్తులను నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
Next Story