Fri Dec 12 2025 12:30:04 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా కొనసాగుతున్న సస్పెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. అయితే రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగియడంతో గతంలో ఉన్న రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణకు వెళ్లవచ్చని చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు స్పష్టత వచ్చే...
అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మరొకవైపు ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేక పార్టీ తరుపున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలా? అన్న దానిపై నేడు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈరోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story

