Fri Dec 05 2025 12:41:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం నేడు బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

తెలంగాణ ప్రభుత్వం నేడు బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. స్పెషల్ లీవ్ పిటీషన్ ను వేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులతో చర్చించి అందుకు అవసరమైన ఇన్ పుట్స్ ను అందించింది. ఇటీవల బీసీ 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లపై జారీ అయిన జీవో నెంబరు 9ను హైకోర్టు కొట్టి వేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిలిచిపోయాయి. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో ఇప్పటికే ప్రభుత్వం పెద్దలు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో...
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే శాసనసభ, శాసనమండలిలో బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపి మూడు నెలలయినా ఆమోదించకపోవడం వల్లనే జీవో జారీ చేశామని తెలంగాణ ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించనున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు కానున్న స్పెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందింస్తుందన్నది చూడాలి.
Next Story

