Fri Dec 05 2025 12:41:49 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపటి బంద్ కు కాంగ్రెస్ మద్దతు
రేపు బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది

రేపు బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని బీసీ సంఘాలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు నిచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు బీసీలు నిర్వహిస్తున్న బంద్ కు తమ సంపూర్ణ మద్దతును కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే కొందరు ఈ బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని, ఆ అడ్డుకునే వారెవరో అదరికీ తెలుసునని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఒకవైపు రిజర్వేషన్లు అడ్డుకుంటేనే మరొకవైపు బంద్ కు మద్దతు ప్రకటించి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని పీసీసీ చీఫ్ తెలిపారు.
తాను కూడా పాల్గొంటానని...
రేపటి బంద్ లో తాను కూడా పాల్గొంటానని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ బంద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలందరూ పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్లను తెచ్చిందే తామని ఆయన గుర్తు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. రేపటి బంద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
Next Story

