Fri Dec 05 2025 23:49:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఎంగిలపూల బతుకమ్మ
నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ పండగ ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిదిరోజుల పాటు ఈ పండగను నిర్వహించుకోనున్నారు.

నేటి నుంచి తెలంగాలో బతుకమ్మ పండగ ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిదిరోజుల పాటు ఈ పండగను నిర్వహించుకోనున్నారు. రోజుకొక్క బతుకమ్మను పేర్చి ఆడి, పాడి చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా పండగ సమయంలో బతుకమ్మ పండగ నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. ప్రకృతి ప్రసాదించిన పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడి పాడి చేసుకునే పండగ కావడంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం కావడంతో ఈ సంబురాలు తొమ్మిది రోజులు సాగనున్నాయి.
నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు...
గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి రంగుల గల పువ్వులను పేర్చి బతుకమ్మగా తయారు చేస్తారు. మహిళలంతా ఒకచోట చేరి ఆడి..పాడతారు. నేటినుంచి బతుకమ్మ సంబురాలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ అంటే జీవితం అని అర్థం. జీవితమంతా కుటుంబం సంతోషం, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ బతకమ్మ పండగను జరుపుకుంటారు. అందమైన పూలతో పేర్చే బతుకమ్మ పండగ నేటి నుంచి ప్రారంభమై దసరా పండగ రోజు వరకూ సాగనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంది.
Next Story

