Mon Jul 04 2022 07:15:37 GMT+0000 (Coordinated Universal Time)
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా బయటే ఉండి ఆందోళన చేస్తున్నారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాత్రంతా బయటే ఉండి తమ నిరసనను తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
కేసీఆర్ విజిట్ చేయాల్సిందే....
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ నిరసన తెలియజేసేవారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం మూడు సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదు. 2017 లో తాము నిరసన చేసినా అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపస్ కు ఒకసారి వచ్చి తమ సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story