Sat Mar 07 2026 18:07:30 GMT+0530 (India Standard Time)
బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు
బండి సంజయ్ యాదాద్రి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి లేదని చెప్పారు.

బండి సంజయ్ యాదాద్రి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి లేదని చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా బండి సంజయ్ ను యాదాద్రికి అనుమతించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై యాదాద్రి లక్ష్మీ నరిసింహస్వామి వద్ద ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన యాదాద్రికి బయలుదేరారు.
కేసీఆర్ కు సవాల్....
దమ్ముంటే కేసీఆర్ ను కూడా వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అయితే పోలీసులు మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి బండి సంజయ్ ను ఆపేశారు. మర్రిగూడ వద్ద ఉన్న బండి సంజయ్ ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే తాను యాదాద్రికి బయలుదేరి వెళ్లి ప్రమాణం చేస్తానని బండి సంజయ్ చెబుతున్నారు.
Next Story

