Sun Feb 09 2025 20:43:56 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ భారీ విజయం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ ఎన్నికల్లో

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ ఎన్నికల్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ కనిపించలేదు. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2.12 లక్షల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్‌పై బండి సంజయ్ విజయం సాధించారు. ఈ విజయంతో బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు.
2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి 89,508 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అంతకు మించి ఆధిక్యాన్ని బండి సంజయ్ సాధించారు.
Next Story