Tue Apr 07 2026 10:25:30 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బండి సంజయ్ వార్నింగ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్ల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోబోనని , ఇక్కడి నుంచే యుద్ధం మొదలు పెడతానని అన్నారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ప్రజల తీర్పు గౌరవించాలని బండి సంజయ్ కోరారు. కరీంనగర్ మేయర్ పీఠం తమదేనని రాసిపెట్టుకోవాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
మేయర్ పదవిని దక్కించుకునేందుకు...
కరీంనగర్ మేయర్ పదవి దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. అలా చేస్తే చూస్తూ ఊరుకోం బిడ్డా అని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలంటే ఆషామాషీ కాదని, కరీంనగర్ వీధుల నుంచి తరిమి కొడతారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేసే కుట్రలు తమకు తెలుస్తున్నాయని, తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Next Story

